బీచ్ లో కొట్టుకొచ్చిన 200 కోట్లరూపాయల వస్తువు

బీచ్ లో కొట్టుకొచ్చిన 200 కోట్లరూపాయల వస్తువు

0
82

తమిళనాడులో బీచ్ లో కొట్టుకు వచ్చిన ఓ వస్తువు అందరిని షాక్ కి గురి చేసింది…తమిళనాడులోని మహాబలిపురం సముద్రతీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు ఇది సుమారు
200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఓ డ్రమ్లో చైనా భాషలో రాసి ఉన్న కవర్లను గమనించారు స్థానికులు. ఈ కవర్లలో టీ పొడి లాంటి పదార్థం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్యాకెట్లలో ఉన్న పొడిని మెథా బయోటిన్ డ్రగ్గా గుర్తించింది తమిళనాడు నార్కోటిక్ విభాగం.

ఇది దాదాపు కోట్లలో విలువ ఉంటుంది అని అంటున్నారు అధికారులు.. అయితే ఇది
డ్రమ్ములకి తాళ్లు కట్టి నీళ్లలోంచి బయటకు తీసి తీసుకెళ్తుండగా పడిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఇక్కడ డ్రగ్స్ దందా పెరిగిందని వారిని త్వరలో పట్టుకుంటాము అని చెబుతున్నారు అధికారులు.