భార‌త్ లో క‌నిపించిన మ‌రో అరుదైన పాము – ఇదే తొలిసారి

భార‌త్ లో క‌నిపించిన మ‌రో అరుదైన పాము - ఇదే తొలిసారి

0
142

మ‌న దేశంలో ఎక్కువ‌గా కాటు వేసే పాముల్లో నాగుపాము త్రాచు క‌ట్ల‌ పాము మ‌న‌కు తెలుసు, అయితే స‌న్న‌గా కొండ‌చిలువ రంగులో ఉంటుంది రక్త‌పింజ‌ర‌, చెట్ల‌ గుబుర్లు పొద‌ల‌లో ఉంటుంది, ఒక్క కాటుకి ఇక ప్రాణం పోతుంది.

ఇది చాలా విషంతో నిండి ఉండే పాము, ఒక్క కాటు వేస్తే క్ష‌ణాల్లో ప్రాణాలు పోతాయి, మ‌న దేశంలో దీని కాటుకి కూడా వేలాది మ‌ర‌ణాలు సంభ‌వించాయి, అయితే వీటికి ఒక‌త‌ల‌మాత్ర‌మే ఉంటుంది కాని తాజాగా
అరుదైన రీతిలో ఓ రక్తపింజరి రెండు తలలతో ఉండడాన్ని గుర్తించారు స్ధానికులు.

దీనిని మహారాష్ట్రలోని కల్యాణ్ జిల్లాలో డింపుల్ షా అనే వ్యక్తి చూశాడు, ఈ పాముని చూడ‌గానే డిఫ‌రెంట్ గా ఉంది, దీనికి రెండు త‌ల‌ల ఉన్నాయి, వెంట‌నే అటవీ అధికారులకి స‌మాచారం ఇచ్చాడు, వారు దీనిని ప‌రిశీలించారు, ఇలా ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో క‌నిపించ‌లేదు అని అన్నారు, దీనిని సరీసృపాల సంరక్షణ కేంద్రానికి తరలించారు.