భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమిటి ? భీష్ముడు ఎందుకు వివాహం చేసుకోలేదు

భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమిటి ? భీష్ముడు ఎందుకు వివాహం చేసుకోలేదు

0
276

భీష్మ ప్రతిజ్ఞ అనే మాట మనం వింటూ ఉంటాం, గతంలో పెద్దలు కూడా ఈమాట అనేవారు, ఇప్పుడు కూడా చాలా మంది భీష్మ ప్రతిజ్ఞ చేశావా అంటారు, అయితే దీని వెనుక పెద్ద గాధ ఉంది మరి అది తెలుసుకుందాం.

సంసార జీవితంపైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహం చేసుకోవాలి అని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే భీష్ముడు శంతనుడికి కొడుకుగా ఉన్నాడు, కాని వారు మాత్రం ఆమెని ఇచ్చి వివాహం చేయడానికి సంకోచిస్తారు.

దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి, మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ వివాహంకోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి, తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణా బాధ్యతను స్వీకరిస్తానని చెబుతాడు.

అంతేకాదు వారికి మాట ఇచ్చి అసలు నేను వివాహం చేసుకోను అని చెబుతాడు..భీష్మించి, తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు. అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఇలా తనకుమారుడు బీష్ముడు చేసిన పని తెలిసి శంతనుడు ఆనందిస్తాడు. ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి, తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శంతనుడు.. అది దీని వెనుక ఉన్న చరిత్ర.