పెళ్లి చేసుకునే వారి మరో బిగ్ షాక్…

పెళ్లి చేసుకునే వారి మరో బిగ్ షాక్...

0
84

జీవితంలో ఎవరికైనా పెళ్లి అనేది అతి ముఖ్యమైన ఘట్టం నిజానికి మార్చి నుంచి పెళ్లి భాజాలు మోగాలి… కానీ కరోనా దూసుకు వచ్చేసింది… దీంతో బంగారులాంటి ముహూర్తాలు ఉన్న ఏప్రిల్ నెల అంతా బోసిపోయింది.. ఇప్పుడు మే మధ్యలోకి వచ్చేసినా పెళ్లిళ్ల గోల లేకుండా పోయింది..

ఎన్నో అంక్షలు పెడుతూ మరెన్నో నిబంధనలు ప్రభుత్వాలు విధిస్తున్నారు… ఇక తప్పనిసరిగా పెళ్లిళ్లు జరగాలని అనుకునేవారు మాత్రం అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.. అవి వెల్లువలా రావడంతో అధికారులకు కూడా తలనొప్పిగా మారింది…

ఇక ఈ నెల 30 తరువాత శుక్రమౌఢ్యం వచ్చేసింది… ఆ తర్వాత రెండు నెలల పాటు పెళ్లిళ్లకు మంచి ముహూర్తలు లేవు దాంతో తొందరపడుతున్నారు… అనుమతుల కోసం కాళ్లు అరిగేలా తిరుతున్నారు… అనుమతి లభిస్తే కనుక చాలా వరకు వివాహాలు ఈ నెలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి…