బిగ్ బాస్ సీజన్ 4కి హోస్ట్ గా ఆ స్టార్ హీరోని ఫిక్స్ చేశారట…

బిగ్ బాస్ సీజన్ 4కి హోస్ట్ గా ఆ స్టార్ హీరోని ఫిక్స్ చేశారట...

0
118

బుల్లితెరలో ప్రసారమయ్యే అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్…. తెలుగులో ఈ షో అంత ప్రాధాన్యత ఉండదని మొదట్లో అందరు భావించారు… ఫస్ట్ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు… ఈ షో ప్రారంభం అయిన నాటినుంచి చివరివరకు అద్బుతమైన రేటింగ్స్ వచ్చాయి…..

ఇక బిగ్ బాస్ 2 సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు ఈ సీజన్ కాస్త డల్ అయినప్పటికీ సీజన్ 3 ని కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించి కింగ్ చేశాడు… ఇప్పుడు మరో ఆరు నెలల్లో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ కానుంది… ఈ నేపథ్యంలోనే ఈ షోకు హోస్ట్ గా ఎవరిని నియమిస్తారనే చర్చ సాగుతోంది…

ఇప్పటికే సోషల్ మీడియాలో సీజన్ 4కు సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి… నెక్ట్స్ హోస్ట్ గా చిరంజీవి వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి… మరికొందరు విక్టర్ వెంకటేష్ లేదంటే రవితేజ హోస్ట్ గా వస్తారని ప్రచారం సాగుతుందో…

అయితే తాజాగా సమాచారం ప్రకారం సీజన్ 4 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తారని తెలుస్తోంది… ఆయన నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ చిత్రం సీజన్ కల్లా పూర్తి అవుతుండటంతో ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది… ఇందుకు ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది…