బిగ్ బజార్ కస్టమర్లకు గుడ్ న్యూస్

బిగ్ బజార్ కస్టమర్లకు గుడ్ న్యూస్

0
161

సూపర్ మార్కెట్ బిగ్ బజార్ అంటే తెలియని వారు ఉండరు… దేశంలో వందల స్టోర్స్ కలిగి ఉంది ఈ కంపెనీ ..అయితే

కిశోర్ బియానీ ఫ్యూచర్ రిటైల్కు చెందిన సూపర్ మార్కెట్ బిగ్ బజార్ తన కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఇక నేరుగా సరుకులు హోమ్ డెలివరీ చేయనున్నారు… ఆన్ లైన్ ఆర్డర్ సర్వీసులు ప్రారంభించారు, ఇక మీరు ఆర్డర్ చేసిన రెండు గంటల్లో ఈ సరుకులు మీ ఇంటి ముందుకు వస్తాయి.

 

 

దేశంలో హైపర్ మార్కెట్ లో బిగ్ చెయిన్గా వ్యవహరిస్తోంది బిగ్ బజార్… తాజాగా ఇలా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.. ముఖ్యంగా ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ నుంచి చాలా పోటీ ఎదురు అవుతోంది. దీంతో ఈ కీలక స్టెప్ వేశారు…తొలి దశలో ముంబై, బెంగళూరు, ఢిల్లీలో ఈ సర్వీసులు ప్రారంభించామని కంపెనీ తెలిపింది…ఇక రానున్న 45 రోజుల్లో మొత్తం 150 పట్టణాల్లో ఇలా సరుకు హోమ్ డెలివరీ చేయనున్నారు.

 

రోజుకు లక్ష వరకు హోమ్ డెలివరీ రిక్వెస్ట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించింది కంపెనీ.. కస్టమర్ల నుంచి డెలివరీ చార్జీల కింద రూ.49 వసూలు చేస్తామని తెలిపింది. కనీసం కస్టమర్ రూ.500 ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తానికి ఇంటిలో ఉండి బిగ్ బజార్ నుంచి సరుకులు తెప్పించుకోవచ్చు.