తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి బుధ‌వారం మ‌రో సెలబ్రిటీ

తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి బుధ‌వారం మ‌రో సెలబ్రిటీ

0
104

బిగ్ బాస్ సీజ‌న్ 4 స్టార్ట్ అయింది, రెండు వారాలు పూర్తి అయ్యాయి.. ఇద్ద‌రు ఎలిమినేష‌న్ అయ్యారు. చివ‌ర‌కు ఇద్ద‌రు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌డంతో హౌస్ లో అంద‌రూ సెట్ అయ్యారు, అయితే ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడ‌టానికి లేకుండా ఈ వారం నాగార్జున స‌రికొత్త టాస్క్ ల‌తో అల‌రించారు, సో ఇక ఎవ‌రూ సేఫ్ ప్లే ఆడ‌కుండా చేశారు.

ఇప్పుడు వారిలా వారు ఉండాల్సిందే, అయితే తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 4లో అందరూ ఊహించింది ఎప్పుడూ జ‌ర‌గ‌దు క‌దా , తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండ‌బోతోంది అని తెలుస్తోంది.

ఎవరంటే.. అల్లరి నరేష్ జంప్ జిలానీలో హీరోయిన్‌గా నటించిన స్వాతి దీక్షిత్.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 14 రోజులు క్వారంటైన్ పూర్తి అయింద‌ట‌, ఇక బుధవారం లేదా గురువారం ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.