బిగ్ బాస్ హారిక కోసం పర్మిషన్ తీసుకున్న అభిజిత్

బిగ్ బాస్ హారిక కోసం పర్మిషన్ తీసుకున్న అభిజిత్

0
114

బిగ్ బాస్ సీజన్ 4 ఎపిసోడ్ 74 సరికొత్తగా సాగింది.. ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు హౌస్ లోకి వస్తున్నారు. కమాండో టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిని ఇంటిలోకి పంపిస్తున్నారు, మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో రెండున్నర నెలల నుంచి ఉన్న హౌస్ మేట్స్ కి ..వారి సొంత వారిని చూసేసరికి ఆనందం వచ్చింది.

వారికి గిఫ్ట్ లు పంపిస్తూ వారి ఆనందం తెలిపారు, మరీ ముఖ్యంగా అఖిల్ పుట్టిన రోజున అతని తల్లిని చూసి చాలా ఆనందించాడు, ఇక అవినాష్, అభిజిత్, హారిక, అఖిల్ పేరెంట్స్ నుంచి ఒక్కొక్కరు హౌస్ లోకి వచ్చి వెళ్లారు, కరోనా నేపథ్యంలో ప్రత్యేక సెట్ వేసి వారిని చూసేలా ఏర్పాట్లు చేశారు.

ఇక హారిక తల్లి కూడా చాలా ఆనందించింది, అయితే నేను ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటకి వెళతాను అంటే వెళ్లు అప్పుడు చిన్నదానివి ఇప్పుడు పెద్దదానివి కదా అని చెప్పింది హారిక తల్లి, అంతేకాదు అభిజిత్ ఈ సమయంలో నేను హారికని ఓ ప్లేస్ కి తీసుకువెళతా అంటే తీసుకువెళ్లు పర్మిషన్ ఇస్తున్నా అని ఆమె తెలిపారు, దీంతో అభి ఆమెని ఓ ప్లేస్ కు తీసుకువెళతా అని చెప్పాడు, అయితే అది మన దేశంలో ప్రాంతం అని ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఓ చక్కని ప్రాంతం అని అదంటే అభికి ఇష్టమని తెలుస్తోంది.