నా బాయ్ ఫ్రెండ్ నేను అందుకే విడిపోయాం- దివి లవ్ స్టోరీ వింటే కన్నీరే

నా బాయ్ ఫ్రెండ్ నేను అందుకే విడిపోయాం- దివి లవ్ స్టోరీ వింటే కన్నీరే

0
157

బిగ్ బాస్ హౌస్ లో దివి ఎంతో బాగా ఆడింది ఆట, అంతేకాదు ఆమె ఏడో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది, ఆమె బయటకు రావడం ఆమె అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు, అయితే ఇంత బాగా ఆడిన దివి కచ్చితంగా చివరి వరకూ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కాని ఆమె బయటకు వచ్చేసింది.

ఇక ఆమెకు పలు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి, ఇక తాజాగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది, నన్ను ప్రేక్షకులు బాగా ఆదరించారు అనే విషయాన్ని తెలిపి సంతోషించింది ఆమె.నాకు దీపిక పదుకోన్ అంటే ఇష్టం అని చెప్పింది దివి.
నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నాను, కాని అలా జరగలేదు,ఇప్పుడు అమ్మా, నాన్నచెప్పిన వ్యక్తినే నేను పెళ్లి చేసుకొంటాను అని చెప్పింది దివి.

నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల బ్రదర్ చనిపోయారు, ఈ సమయంలో తను నాకు దూరం అయ్యారు, తాను ఇక బిజినెస్ చూసుకోవాలి అని వెళ్లిపోయాడు, నేను చాలా బాధపడ్డాను, ఆ చనిపోయిన వ్యక్తి కూడా నాకు మంచి స్నేహితుడు.నాకు సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి , అలాగే మంచి వంట చేసేవాడు కావాలి.నా బాయ్ఫ్రెండ్ మళ్లీ తిరిగి నా దగ్గరకు వస్తే నేను మళ్లీ అతడితో ఉండలేను అని చెప్పింది దివి, జస్ట్ కనిపిస్తే మాట్లాడుతాను అంతే అని చెప్పింది దివి.