పక్షులకి ప్రసాదంగా ఇవి పెట్టకండి దారుణం జరిగిపోతుంది

పక్షులకి ప్రసాదంగా ఇవి పెట్టకండి దారుణం జరిగిపోతుంది

0
141

మనలో చాలా మందికి పక్షులని చూడగానే ప్రేమ పుడుతుంది.. చాలా మంది పక్షులకి ప్రేమగా ఆహరం పెడుతున్నాం అని భావిస్తారు.. అయితే మీరు పెట్టే ఆహరం వాటి చావుకి కారణం అవుతోంది అని మీకు తెలుసా.. అవును దీని వల్ల చాలా ప్రమాదం ఉంది.. గుడికి వెళ్లిన సమయంలో పులిహోర లడ్డూ ప్రసాదాలు తీసుకుంటాం. ఇవి మనం తినడం వరకూ ఒకే, కాని అక్కడ పక్షులకి పావురాలకి పెడతాం.

మీరు పెట్టే పులిహోరలో కచ్చితంగా దేవాలయాల్లో ఇంగువ వేసి తయారు చేస్తారు.. ఈ ఇంగువ పక్షుల ప్రాణాలకి ప్రమాదం.. మీరు పక్షులకి వేసే పులిహోరలో ఇంగువ ఉంటుంది. అది తిన్న పావురాలు శరీరం లోపల అవయవాలపై ప్రభావం పడటంతో అవి చనిపోతున్నాయి. అలాగే తియ్యటి లడ్డూ లాంటి తీపి పదార్దాలలలో ఉండే యాలకులు తినడం వల్ల అవి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి.

ఇలా పులిహార కూడా వాటికి పెట్టకూడదు అని చెబుతున్నారు డాక్టర్లు. ఇవి తిని చాలా వరకూ దేవాలయాల బయట పక్షులు చనిపోతున్నాయి, వాటికి తెలియక దేవాలయాల దగ్గర పెట్టే ప్రసాదాలు తిని అన్యాయంగా చనిపోతున్నాయి. ముఖ్యంగా వందలాది పావురాలు ఇలా చనిపోతున్నాయి అని డాక్టర్లు చెబుతున్నారు.. అందుకే మీరు గుడికి వెళితే ప్రసాదాలు పెట్టే సమయంలొ ఇవి మాత్రం పక్షులకి పెట్టకండి.