తమిళ హీరోతో బోయపాటి చిత్రం ప్లాన్ – టాలీవుడ్ టాక్

Boyapati movie plan with Tamil hero- tolly wood talk

0
137

ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య బాబుతో అఖండ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తారా అనే టాక్ కూడా టాలీవుడ్ లో నడుస్తోంది. ఈ చిత్రం దసరాకి విడుదల అవ్వచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి బన్నీతో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ సినిమా పక్కాగా అనౌన్స్ మెంట్ రావచ్చు అని అంటున్నారు.

ఒకవేళ బోయపాటి బన్నీతో సినిమా చేయకపోతే ( కాస్త లేట్ అయితే) మరో హీరోతో సినిమాకి సిద్దం అవుతారు అని తెలుగు చిత్ర సీమలో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలోనే కాదు తెలుగులోను మంచి మార్కెట్ సంపాదించుకున్నారు హీరో విశాల్ . అయితే బోయపాటి ఆయనతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట.

కొద్ది నెలలుగా ఆయన తెలుగు సినిమా చేయాలనే ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బోయపాటితో ఒక సినిమా చేయనున్నారనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అన్నీ సెట్ అయితే బన్నీ సినిమా అయ్యాక సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు.ఈ సినిమా, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగుతుందని అంటున్నారు. చూడాలి బన్నీ సినిమా కంటే ముందు ఇది చేస్తారా, లేదా బన్నీసినిమా తర్వాత ఈ చిత్రం చేస్తారా అనేది.