ఇప్పటికే మన దేశంలో దాదాపు 59 చైనా యాప్స్ నిషేధించింది మన భారత ప్రభుత్వం, ఈ సమయంలో ఇక ఆ యాప్స్ ఎక్కడా కనిపించడం లేదు, అయితే తాజాగా పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎంతో ప్రాచుర్యం పొందిన పబ్జీ గేమ్ ను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.
ఈ విషయాన్ని పాకిస్థాన్ టెలి కమ్యూనికేషన్ అథారిటీ ప్రకటించింది. పబ్జీ గేమ్ ఒక వ్యసనమని… దాని వల్ల సమయం వృథా అవుతుందని తెలిపింది. దీని వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్నారులు యువత ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని దీనిని బ్యాన్ చేయాలనే డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
మిషన్ పూర్తి చేయడంలో విఫలం కావడంతో… 16 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డాడు… ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ గేమ్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు మరింత పెరిగాయి, దీంతో పాక్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.