బ్రేకింగ్ – ఇకపై 11 అంకెల మొబైల్ నంబర్

బ్రేకింగ్ - ఇకపై 11 అంకెల మొబైల్ నంబర్

0
106

ఇప్పటి వరకూ మొబైల్స్ వాడే వారికి టెలికం కంపెనీల నుంచి పది అంకెల మొబైల్ నెంబర్లు వస్తున్నాయి, అయితే తాజాగా మొబైల్ నంబర్ల విషయంలో టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలో 10 అంకెల మొబైల్ నంబర్ స్థానంలో 11 అంకెల మొబైల్ నంబర్ ను వినియోగించాలని ప్రతిపాదించింది.

చర్చల తర్వాత పలు విషయాలు తెలిపారు, ఇప్పటి వరకూ మన దేశంలో అన్నీ మొబైల్ నెంబర్లు 10 అంకెలతోనే ఉన్నాయి, ఇక 11 అంకెలతో నెంబర్లు వస్తే కొత్తగా నంబర్ల సంఖ్యను పెంచుకోవచ్చని ట్రాయ్ తెలిపింది. మొబైల్ నంబర్లకు ముందు 9 అంకెను కలపడం ద్వారా అవి 11 అవుతాయని తెలిపారు.

ఇలా చేయడం వల్ల టెలికాం ఆపరేటర్లు కొత్తగా మరో 1000 కోట్ల మొబైల్ నంబర్లను వాడుకలోకి తీసుకురావచ్చని ట్రాయ్ తెలిపింది. తాజాగా ఈ నిర్ణయంతో ఇక మొబైల్ నెంబర్లు 11 అంకెలుగా రాబోతున్నాయి.