దేశ వ్యాప్తంగా మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్యులు చేసుకుంటున్నారని తాజాగా ఓ సర్వే ద్వారా తెలిసింది… ఈ సర్వే ప్రకారం 2019 సంవత్సరంలో రోజుకు సగటున 381 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జాతీయ నేర గణాంక విభాగం తెలిపింది… 2019 సంవత్సరంలో 139123 మంది ఆత్మహత్య చేసుకున్నారు…
అందులో పురుషులే ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్నారని తేలింది… గత ఏడాది కంటే ఈ ఏడాది ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయని తెలిపింది… ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 70.2 శాతం మంది పురుషులు ఉండగా మహిళలు 29.8 శాతం మంది…. ఎక్కువగా పురుషులు వివాహం చేసుకున్న తర్వాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..
వివాహం అయిన తర్వాత సుమారు 68.4 శాతం మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ సర్వే తెలిపింది… ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నవారు 53.6 ఉండగా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నవారు 25.3….అలాగే 3.8 నిప్పంటించుకుని 5.2 నీళ్లల్లో మునిగి ఆత్మహత్య చేసుకున్నవారు..