క్వారంటైన్ లో ప్రేమికుల వివాహం, అమ్మాయి గర్భవతి కూడా

క్వారంటైన్ లో ప్రేమికుల వివాహం, అమ్మాయి గర్భవతి కూడా

0
103

ఈ వైరస్ కాలంలో వింత పెళ్లిళ్లు చూస్తున్నాం ,ఏకంగా ఆన్ లైన్ లో మూడు ముళ్లు కూడా వేసేస్తున్నారు,సెల్ ఫోన్ కంప్యూటర్లలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి, తాజాగా ఓ వివాహం ఇలాగే జరిగింది..ఒడిశాలోని పూరీ జిల్లాలో ఓ గ్రామంలో క్వారంటైన్లో ఉంటున్న ఇద్దరు ప్రేమికులు అక్కడే మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యారు.

వరుడు పేరు దాస్ అతని వయస్సు 19 ఏళ్లు…. దాస్ – రాణి అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇక ఇంట్లో పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు, దీంతో ఆమెని జనవరిలో గుజరాత్లోని అహ్మదాబాద్కి తీసుకుని వెళ్లిపోయాడు.అక్కడే ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇంతలో లాక్డౌన్ వచ్చింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీ మూసేశారు.

వలస వెళ్లినవారిలాగానే దాస్ కూడా రాణితో తిరిగి సొంత ఊరు వచ్చేశాడు.వీరికి వైరస్ లక్షణాలు కనిపించాయి, కాని పరీక్షల్లో నెగిటీవ్ వచ్చింది, దీంతో వీరిని 14 రోజుల పాటు క్వారంటైన్లోనే ఉండాలన్నారు అధికారులు. అప్పటికే పింకీరాణి గర్భవతి. అలా క్వారంటైన్ సమయం ముగిసింది. ఇక అందరి సమక్షంలో ఆమెకి తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు, చివరకు వారి ఇంటికి వెళ్లిపోయారు.