కాస్ట్లీ ఫేస్ క్రిమ్ కు బైబై… ఇలా చేస్తే మీ ముఖం అందంగా మారుతుంది…

కాస్ట్లీ ఫేస్ క్రిమ్ కు బైబై... ఇలా చేస్తే మీ ముఖం అందంగా మారుతుంది...

0
99

ఈవేంట్ పార్టీలకు, పెళ్లిలకు రెడీ అవ్వాలంటే ఖరీదైన ఫేస్క్రీమ్ లు వాడుతుంటారు… ముఖ్యంగా అమ్మాయిలు… అయితే ఆ క్రీమ్ కొద్ది క్షణాలవరకే ఉంటుంది.. ఆ తర్వాత ఒరిజినల్ ఫేస్ లొకి వస్తారు… మచ్చలు మొటిమలు కనిపించకుండా ఉండేందుకు పైపై పూతలు పూసుకునే కంటే శాశ్వితంగా తొలగిపోయేందుకు సహజ సిద్దమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది…అప్పుడే అందం సహజత్వాన్ని పొందుతుంది…

ఆరెంజ్ జ్యూస్ మూడు చెంచాలు అలాగే తేనే సగం చెంచా… గ్లిజరిన్ మూడు చుక్కుల… స్క్రబ్ ఓట్స్ ఒక చెంచా యాపిల్ గుజ్జు రెండు చెంచాలు చిక్కటి పాలు ఒక చెంచా ఫేస్ మాస్క్ కోసం, కొబ్బరి పాలు రెండు చెంచాలు శనగపింది… ఒక చెంచా జామగుజ్జు ఒక చెంచా, తీసుకోవాలి….

తయారీ విధానం… ముందుగా తేనే గ్లిజరిన్ ఆరెంజ్ జ్యూస్ ఒక చిన్న పాత్రలో పోసుకుని బాగా కలపాలి… ఈ మిశ్రమాన్ని పట్టించి రెండు నిమిషాలతర్వాత మెత్తని క్లాత్ తో క్లీన్ చేయాలి… తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టుకోవాలి… ఇప్పుడు జామండు గుజ్జు, కొబ్బరి పాలు శనగపిండి ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కొవాలి… ఇలా వారానికి రెండు సార్లు చేయడంవల్ల మంచి ఫలితం వస్తుందట..