చాలా మంది సెల్ ఫోన్ బాగానే వాడుతారు, ఏకంగా రోజుకి 15 గంటలు సెల్ తోనే ఉండేవారు ఉంటారు, అయితే ఇది చాలా ప్రమాదకరం.. తాజాగా రాత్రి పడుకునే సమయంలో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంది ఓ మహిళ, ఇద్దరు పిల్లలు ఆమె బెడ్ రూమ్ లో పడుకుతున్నారు.
కాని ఒక్కసారిగా ఆ సెల్ ఫోన్ పేలి రాత్రి ఇంటిలో మంటలు వ్యాపించి పిల్లలు తల్లి ముగ్గురు మరణించారు ..తమిళనాడులో ఈ సంఘటన ఉలిక్కి పడేలా చేసింది, అయితే చార్జ్ ఫుల్ అయిన తర్వాత తీయకుండా అలా ఉంచడం వల్ల బ్యాటరీ హీట్ అవుతుంది.
దీని వల్ల పేలుడు సంభవించి కరెంట్ షాక్ కొట్టడం లేదా షార్ట్ సర్క్యూట్ అవ్వడం జరుగుతుంది, అంతేకాదు ఇంటిలో మంటలు కూడా వస్తాయి, అందుకే రాత్రి పడుకున్న తర్వాత పక్కన సెల్ పెట్టుకోవద్దు, అలాగే చార్జ్ పెట్టి అసలు నిద్రపోవద్దు అంటున్నారు టెక్ నిపుణులు.