బిగ్‌ బాస్‌ నుంచి చంటి అవుట్‌?

-

బిగ్‌ బాస్‌ సిక్స్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా ఫిక్స్‌ అంటూ వచ్చిన తెలుగు బిగ్‌ బాస్‌ ఆరో సీజన్‌ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతుంది. ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎంటర్‌ అయిన వాళ్లల్లో చాలామంది కంటెస్టెంట్లు ఎవరో కూడా తెలయని పరిస్థితి నెలకొందని చెప్పటంలో సందేహమే లేదు. అయినా ఏదో రకంగా ఐదు వారాలను పూర్తి చేసింది. ఈ వారం నామినేషన్లలలో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, ఫైమా, వాసంతి కృష్ణన్‌, ఆదిరెడ్డి, అర్జున్‌ కల్యాణ్‌లు ఉన్నారు. వీరిలో ఫైమా, ఇనాయా సుల్తానా మధ్య ఓటింగ్‌ పోటాపోటీగా జరగగా.. పోలింగ్‌ ముగిసే సమయానికి ఫైమా టాప్‌ ప్లేస్‌కు చేరుకుందట. ఆమెకు కొద్ది దూరంలోనే ఇనాయా రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో అర్జున్‌ కల్యాణ్‌, నాలుగో స్థానంలో వాసంతి, ఐదో స్థానంలో చంటి ఉన్నట్లు వినికిడి.

- Advertisement -

ఆ తరువాత వరుసలో ఆరో స్థానంలో బాలాదిత్య ఉండగా, ఏడో స్థానంలో ఆది రెడ్డి నిలిచారట. అందరికంటే తక్కువుగా ఓట్లు పోలయ్యి, ఎనిమిదో స్థానంలో మెరీనా ఉందట. కానీ ఇది బిగ్‌ బాస్‌ ఏదైనా జరగొచ్చు అన్నట్లు ఐదో ప్లేస్‌లో ఉన్న చంటి ఎలిమినేట్‌ అయినట్లు లీకులు వినిపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఏమీ తినటం లేదట, డల్‌ పర్ఫామెన్స్‌, ఇచ్చే రెమ్యునరేషన్‌కు తగ్గట్లు ఎంటర్‌టైన్‌ చేయకపోవటం వంటి కారణాలతో చంటిని బిగ్‌ బాస్‌ నుంచి ఎలిమినేట్‌ చేశారని టాక్‌ వినిపిస్తోంది. పైగా శనివారం జరిగిన హిట్‌-ఫట్‌ టాస్క్‌లో తను ఫట్‌ అనీ.. అంతగా ఎంటర్‌టైన్‌ చేయటం లేదని స్వయంగా చంటీనే ఒప్పుకోవటం, గుర్తుపెట్టుకో చంటీ నువ్వే ప్రేక్షకులకు చెప్పావు అని నాగార్జున అనటం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతుంది. చూద్దాం మరి చంటి ఇంటికి వెళ్తాడో.. బిగ్‌ బాస్‌ ఇంట్లో కంటిన్యూ అవుతాడో!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...