చంద్రుడి శాపం తగ్గించిన శివుడు ? ఆ కథ తెలుసుకోండి

చంద్రుడి శాపం తగ్గించిన శివుడు ? ఆ కథ తెలుసుకోండి

0
102

శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది, ఆయనని ఎంతో మంది నిత్యం కొలుస్తూ ఉంటారు, ముఖ్యంగా సోమవారం ఆయనని భక్తి శ్రద్దలతో భక్తులు కొలుస్తారు, అయితే శివుడు చంద్రుడికి వచ్చిన శాపాన్ని తగ్గించాడు అనేది తెలుసా ఆ స్టోరీ తెలుసుకుందాం.

దక్ష రాజు తన 27 మంది దత్త పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ 27 మంది 27 నక్షత్రాలను సూచిస్తారు. అయితే అందరిలో చంద్రుడికి రోహిణి అంటే ఇష్టం, ఆమెతో ఎక్కువగా ఉండంతో మిగిలిన 26 మంది తండ్రికి ఫిర్యాదు చేస్తారు, ఈ విషయంలో చంద్రుడికి దక్షరాజు చెప్పినా అతను మారడు.

దీంతో దక్షరాజు కోపంతో చంద్రుడ్ని శపిస్తాడు,దీంతో ఆరోజు నుంచి చంద్రుడు రోజు రోజు తన సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా.. తన మెరుపును, పరిమాణంలోనూ కుంచించుకుపోతాడు.ఇది ఆ శాపం వల్ల అని తెలుసుకుని చంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళతాడు, కాని ఆయన దీనికి విముక్తి కావాలి అంటే శివుడ్నిప్రసన్నం చేసుకోమంటాడు.

చివరకు శివుడిని సంపన్నం చేసుకుంటాడు చంద్రుడు, అయితే అప్పటికే ఆ శాపం చంద్రుడిపై ప్రభావం చూపిస్తుంది దీంతో పూర్తిగా దీనిని ఉపసంహరించలేము కాబట్టి పదిహేను రోజులకోసారి పూర్తి రూపంతో పాటు సహజ సౌందర్యాన్ని పొందుతూ.. మిగిలిన 15 రోజులు కుచించుకు పోతూ అదృశ్యమయ్యే వరకు తగ్గిపోతాడు చంద్రుడు. ఇలా ఆ శాపం కొద్దిగా తగ్గిస్తాడు శివుడు..ఇలా చంద్రుడు రూపాన్ని పూర్తిగా పోకుండా కాపాడాడు..ఈ కారణంగానే మనకు పౌర్ణమి, అమవాస్యలు ఏర్పడుతున్నాయి.