చనిపోయిన వాళ్ళను ఇక్కడ తెగ వారు ఏం చేస్తారో తెలిస్తే షాక్

చనిపోయిన వాళ్ళను ఇక్కడ తెగ వారు ఏం చేస్తారో తెలిస్తే షాక్

0
91

మన ప్రపంచంలో అనేక తెగలు ఉన్నాయి.. వారి ఆచారాలు అలాగే చాలా వింతగా ఉంటాయి, ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి ఆచారాలు వారు పాటిస్తారు, అయితే నమామి అనే ఒక గిరిజన తెగ వాళ్లకు ఓ వింత ఆచారం ఉంది..అది ఏంటంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళను కట్టెల మీద కాల్చి , కాలిన ఎముకలను తీసుకొని సూప్ చేసుకొని తాగుతారట.

అసలు ఎవరైనా ఇంటిలో వారు చనిపోతే కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉంటారు.. కాని సూప్ చేసుకోవడం ఏమిటి అని ఆశ్చర్యం రావచ్చు, ఇక్కడ ఆచారం ఇది..అమెజాన్ ప్రాంతాల్లో ఇలా కొన్ని తెగలు ఇప్పటీకి దీనిని ఆచరిస్తున్నాయట..అయితే ఇది బయట వారికి ఎవరికి తెలియకుండా చేస్తారట.

కొందరు దీనిని ఈ మధ్య చాలా వరకూ మానేశారు, మరికొంత మంది మాత్రం పెద్దల నుంచి వస్తున్న ఆచారం అని దీనిని పాటిస్తారు, అలా చేయడం వల్ల వారి శక్తి మనకు వస్తుంది అని వారు నమ్ముతారట, అయితే చాలా మంది మేధావి వర్గం వారిలో మార్పు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.