చెక్పోస్ట్ వద్దే వివాహం – చివరకు మళ్లీ ట్విస్ట్

చెక్పోస్ట్ వద్దే వివాహం - చివరకు మళ్లీ ట్విస్ట్

0
86

ఈ లాక్ డౌన్ వేళ వివాహాలు దాదాపు లక్షల్లో రద్దు అయ్యాయి, మరికొన్ని మాత్రం అనుకున్న ప్రకారం తమ కుటుంబ సభ్యులు కొద్ది మందితో జరిగిపోయాయి.. అయితే గ్రాండ్ గా చేయాలి అని అనుకున్న వారు చాలా మంది ఈ వివాహాలు వాయిదా వేసుకున్నారు, తర్వాత చేసుకుందాం అని వాయిదా వేసుకున్నారు, ఇక కొందరు ఏకంగా సైకిల్ పై ప్రయాణాలు కార్లపై ప్రయాణాలు చేసి ఒకరికి ఒకరు కలుసుకుని వివాహం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి..

తాజాగా తమిళనాడు కేరళకు చెందిన ఓ జంట వివాహం చేసుకుందాం అని అనుకుంది, ఈ సమయంలో తమిళ నాడు నుంచి కేరళ బయలుదేరారు అబ్బాయి కుటుంబ సభ్యులు, కాని మీకు ఇంత మందికి పర్మిషన్ ఇవ్వం, అలాగే ఈ పాస్ కావాలి అని తెలిపారు పోలీసులు, ఇక పాస్ లేదు అని చెప్పడంతో ఇక చేసేది లేక అక్కడ ఉండిపోయారు.

పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో అక్కడకు నేరుగా పెళ్లి కూతురు కుటుంబం వచ్చింది, చివరకు పోలీసులు ఆరోగ్య సిబ్బంది సమక్షంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, అక్కడ వారు అందరూ ఆశీర్వదించారు, చివరకు ఇద్దరు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు… పెళ్లికొడుకుని సింగిల్ గా పెళ్లి కూతురు ఇంటికి పంపమని కోరినా పోలీసులు ఒప్పుకోలేదు, ఈ పాస్ కు అప్లై చేసి వెళ్లండి అని చెప్పారు.