చీర కొన్నా వారికి ఫ్రీగా ఏమిస్తున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

చీర కొన్నా వారికి ఫ్రీగా ఏమిస్తున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

0
99

వ్యాపారాలు చేసే వారు అనేక స్ట్రాట‌జీలు అమ‌లు చేస్తారు.. బిజినెస్ పెర‌గ‌డానికి క‌స్ట‌మ‌ర్లు రావ‌డానికి అనేక ఆఫ‌ర్లు ఇస్తుంటారు. బట్టల వ్యాపారులు మహిళల కోసం ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తుంటారు. చీర కొంటే అది ఫ్రీ ఇది ఫ్రీ అంటూ రకరకాల ఆఫర్లు ఇస్తుంటారు. మ‌రి ఈ వైర‌స్ కాలంలో మాస్క్ లు శానిటైజ‌ర్లు ఫ్రీగా ఇస్తున్నారు.

కాని ఇప్పుడు మ‌రో కొత్త ఆలోచ‌న చేస్తున్నారు వ్యాపారులు..చీర కొనుక్కోండి కరోనా కిట్ ఫ్రీగా పట్టుకెళ్లండీ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. సూరత్ లోని బట్టల వ్యాపారులు చీర కొంటే కరోనా కిట్ ఫ్రీ అంటూ ఆఫర్లు ఇస్తున్నారు.

ఈ కరోనా కిట్ లో శానిటైజర్లు, హోమియోపతి మందు బిళ్లల డబ్బా, ఆయుర్వేదం పౌడర్, మాస్క్‌లు వంటివి ఉన్నాయి. ఇక మినిమం 500 నుంచి ఈ చీర‌లు ఆఫ‌ర్ ఇస్తున్నారు ఇలా 5000 వ‌ర‌కూ ధ‌ర క‌లిగిన చీర‌ల‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్.