చెత్త అనుకుని పారేశారు అందులో ఏముందో తెలిసి షాక్

చెత్త అనుకుని పారేశారు అందులో ఏముందో తెలిసి షాక్

0
101

ఒక్కోసారి మనం కొన్ని చెత్త అనుకుని లోపల చూడకుండానే పారేస్తూ ఉంటాం.. అందులోనే విలువలైన వస్తువులు ఉంటాయి.. కొందరు దీనిని పెద్ద పట్టించుకోరు .. తాజాగా లండన్ లోని బర్న్ హామ్ ఆన్ సీ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

పనికిరాని అట్టపెట్టెలు అని పారవేసేశారు కుటుంబ సభ్యులు .. కాని రీసైక్లింగ్ సిబ్బందికి వాటిలో కళ్లు చెదిరేంత డబ్బు కనిపించింది. ఇటీవలే ఓ వ్యక్తి మరణించగా, అతని బంధువులు ఆ వ్యక్తి ఇంటిని శుభ్రపరిచేందుకు వచ్చారు. వారికి రెండు పాత అట్టపెట్టెలు కనిపించాయి. అయితే వాటిని చెత్తగా భావించిన వారు బయట పారేశారు. అందులో ఏమున్నాయో కూడా వారు చూడలేదు.

తర్వాత రీ సైక్లింగ్ సిబ్బంది దగ్గరకు అవి వెళ్లాయి.. వాటిని తెరిచి చూసి షాక్ అయ్యారు.సుమారు 14 లక్షల రూపాయలు అందులో ఉన్నాయి , చివరకు ఆ అట్టపెట్టలు తెచ్చిన ఇళ్లు సీసీ కెమెరాలతో గుర్తించి ఆ నగదు కుటుంబ సభ్యులకి అందించారు. ఇలా డబ్బు వెనక్కి ఇవ్వడం పై ఆ బంధువులిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు.