మనం వయసులో కాస్త పెద్దగా ఉంటే ఏది అయినా తెలుసుకుంటాం… కాని చిన్న పిల్లలు ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పుకోలేరు.. తమకు తాముగా ఏదీ చెప్పలేరు పాపం ఆ వయసు అలాంటిది, అయితే మనకు నొప్పి మంట బాధ ఏది వచ్చినా చెబుతాం.. కాని పిల్లలు అలా కాదు కదా, అయితే చిన్నపిల్లలకు చెవిలో సమస్య వస్తే ఇలా గుర్తించవచ్చు అంటున్నారు డాక్టర్లు.
చెవిలో సమస్య ఉన్నప్పుడు చిన్నారుల్లో గాని, పెద్దవారిలో గాని కనిపించే మొదటి లక్షణం చెవి బరువుగా అనిపించడం. చెవిపోటు, సరిగ్గా వినిపించకపోవడం, శరీరం సమతుల్యత దెబ్బతిని కళ్లు తిరగడం, వికారం, వాంతులు, పదే పదే చెవిలో నుంచి చీము కారడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇఎన్‌టి డాక్టర్‌ను కలవాలి.
ఇక చిన్నపిల్లలు బాగా ఏడుస్తారు, చెవి దగ్గర చేతులు పెట్టుకుంటారు వారికి చెవిలోపల నుంచి వస్తే నొప్పికి చేతిని బాగా చెవిదగ్గర ఆన్చుతారు ఇవన్నీ వారు చేసే పనులు, నెలల శిశువుల్లో అయితే వాళ్ల సమస్యను చెప్పలేరు ఈ సమయంలో వారు కూడా చేతులతో చెవిని తాకుతారు ఇది వెంటనే గుర్తించి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలి.