కోట్ల ఆస్తి వదిలేసి పనిమనిషిగా మారిన మహిళ ఆమె ఎవరో చూడండి

కోట్ల ఆస్తి వదిలేసి పనిమనిషిగా మారిన మహిళ ఆమె ఎవరో చూడండి

0
105

ఆ కుటుంబానికి డబ్బుకు లోటు లేదు , ఆ ధనిక కుటుంబం, బాగా సెటిల్ అవడంతో వారికి ఏ అసౌకర్యం లేదు, చేతినిండా డబ్బు కార్లు అన్నీ ఉన్నాయి, మరి ఆ ఇంట్లో భార్య భర్త మాత్రమే ఉంటారు, అయితే పిల్లలకు పెళ్లిళ్లు చేసి అమెరికా పంపించారు .ఇక చివరి రోజులు భార్య భర్తలు ఇద్దరు మాత్రమే ఉంటున్నారు, వారికి ఇంట్లో పని మనిషి కావాలని ఆ భార్య ఆమె స్నేహితురాలకి చెప్పింది.. ఈ సమయంలో తనకు తెలిసిన ఓ పని మనిషి ఉందని ఆమె చెప్పింది.
ఆమె పేరు సులోచన, ఆమె వయసు 50 సంవత్సరాలు బాగా పనిచేస్తుంది అని చెప్పింది.ఆమెని ఇంటికి పిలిచి తన డీటెయిల్స్ కునుక్కున్నారు.. తన భర్త లేడని పిల్లలు ఎక్కడో ఉంటున్నారు అని చెప్పింది.. జీతం ఎంత ఇచ్చినా పర్వాలేదు కాని మూడు పూటలా తిండి పడుకోవడానికి ప్లేస్ ఇవ్వండి అని కోరింది. భార్య వంట తిన్న అతనిక సులోచన వంట ఏమాత్రం రుచించలేదు, భర్త బాధ అర్ధం చేసుకుంది భార్య, కాని ఆమెని పనిలోనుంచి తీయలేదు..
నెల రోజులు వేచి చూశారు వారిద్దరూ.తర్వాత నెల రోజుల్లో చాలా మార్పు వచ్చింది. భార్య భర్తలకు సులోచన వంట బాగా నచ్చింది. ఆమె రోజూ ఏదో ఓ పని చేస్తూ ఉండేది.. ఖాళీగా ఉండేది కాదు.. అయితే ఆ ఇంటి యజమాని వ్యాపారి కావడంతో, ఆయన స్నేహితులు చాలా మంది ఇంటికి వచ్చేవారు. స్నేహితులు ఇంటికి వచ్చిన సమయంలో ఆమె వంట బాగుంది అనేవారు. కాని ఆమె మాత్రం మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయేది.
ఈ సమయంలో తనకు ఓ రోజు లీవ్ కావాలి అని యజమానిని కోరింది.. వారికి శ్రమ లేకుండా మధ్యాహ్నం భోజనం వండి వెళ్లింది.ఆరోజు సాయంత్రం ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చింది, తన పని చేసుకుని పడుకుంది, కాని రాత్రి అంతా ఆమె ఏడుస్తూనే ఉంది. ఈ సమయంలో ఆ భార్య భర్తలు ఏమైంది అని అడిగారు కాని ఆమె ఏమీ చెప్పలేదు, తర్వాత ఉదయం ఓ వ్యక్తి కాలింగ్ బెల్ కొట్టాడు,మా అమ్మ ఎక్కడ అని అడిగాడు, వెంటనే మీ అమ్మ ఎవరు అని అడిగాడు ఆ ఇంటి యజమాని, మా అమ్మ సులోచన అని చెప్పాడు. వెంటనే ఆమె కిచెన్ నుంచి బయటకు వచ్చింది, తల్లిని చూసిన కొడుకు ఎందుకు అమ్మా నీకు ఈ బతుకు ఇంటికి రా అని అన్నాడు.

నీకు చాలా డబ్బు ఉంది కదా పోని నాతో ఉండకు , నీకు 5 కోట్లు ఇస్తా తీసుకో అన్నాడు, అయినా ఆమె వినలేదు. అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు అప్పుడు యజమాని ఏమిటి సులోచన వివాదం అని అడిగితే, ఆమె తన గతాన్ని చెప్పింది, తన భర్త ట్రావెల్స్ వ్యాపారం చేసేవారు అందులో చాలా సంపాదించారు. ప్రమాదంలో చనిపోయారు, తర్వాత నా కొడుకు ఆవ్యాపారం చేయకుండా తాగి అప్పులు చేశాడు, కొన్ని ఆస్తులు ఉండగా, నా కొడుక్కి పెళ్లి చేశా, కాని కోడలు నన్ను బయటకు పంపేసింది.

అందుకే ఇలా బయట బతుకుతున్నా, ఇప్పుడు నా కొడుకులో మార్పు వచ్చింది. కాని నా కోడలు మాత్రం నన్ను చూడను అని చెప్పింది. ఇక తర్వాత రోజు ఆమె ఉదయం ఇంట్లో లేదు, కిచెన్ లో ఓ లేఖ రాసింది, తన గురించి తెలిసిన చోట నేను ఉండలేను అని సులోచన లెటర్ లో రాసింది, నేను మీ ఇంటి నుంచి గుర్తుగా ఓ గ్లాస్ తీసుకువెళుతున్నా అని చెప్పింది, తనకు రావలసిన జీతం ఎక్కడైనా అనాద ఆశ్రమంలో ఇవ్వండి అని కోరింది.