క‌రోనా కాయ ఇది మీ ఇంటికి క‌డితే జ‌బ్బు రాదంట‌? ఇలా మీరు చేయ‌కండి

క‌రోనా కాయ ఇది మీ ఇంటికి క‌డితే జ‌బ్బు రాదంట‌? ఇలా మీరు చేయ‌కండి

0
132

కొంద‌రు ఏదైనా చెబితే గుడ్డిగా ఫాలో అవుతారు ఇంకొంద‌రు…. అస‌లు దాని వెనుక ఉన్న విష‌యం కూడా ప‌ట్టించుకో‌రు.. ఈ స‌మ‌యం‌లో దొంగ‌బాబాలు తాయెత్తు స్వాములు చెప్పే సోది న‌మ్మి వారి మాట‌లు విని పైస‌లు వారికి ఇచ్చి, ఓ తాయెత్తు ఓ పండు తెచ్చి ఇంటికాడ పెట్టి జ‌బ్బు న‌యం అవ్వాలి అని కోరుతారు.

కాని ఇలాంటివి అన్నీ పోయినాయి , ఇప్పుడు అంతా సైన్స్ కాలం, కాని ఇంకా ఆ పాత కాలం ప‌ద్ద‌తు‌లు, ఆ కంత్రిగాళ్ల మాయ మాట‌లు న‌మ్ముతున్నారు చాలా మంది , ఇలాగే కొన్ని ప‌ల్లెటూరుల్లో ఓ ప్ర‌చారం మొద‌లైంది, ఈ క‌రోనా పోవాలి అన్నా మీ ఇంటిలో ఉన్న మ‌గోళ్ల‌కి ఆడోళ్ల‌కి జ‌బ్బు రాకూడ‌దు అని మీరు అనుకుంటే, వెంట‌నే ఈ కాయ‌ని మీ ఇంటి గుమ్మానికి క‌ట్టాలి అని ఓ ప్ర‌చారం మొద‌లు పెట్టారు.

క‌రోనా వైరస్ చూస్తే, దానిపై ముళ్లు ఉండేలా ఉంటుంది …..అచ్చం ఉమ్మెత్తకాయలా కనబడుతుంది, దీంతో ఈ ఉమ్మెత్త‌కాయ‌ని మీ ఇంటి గుమ్మానికి త‌గిలిస్తే ఈ జ‌బ్బు రాదు అని ఎవ‌రో అన్నార‌ట‌, పాపం చాలా మంది ఇది క‌ట్టుకుంటున్నారు, దీనిపై వైద్యులు సైన్స్ న‌మ్మేవారు పోలీసులు, ఇలాంటివి న‌మ్మ‌కండి అని ఇవ‌న్నీ నిజాలు కావు అని చెప్పారు, వెంట‌నే అవ‌న్నీ పీకిపారేశారు జ‌నం …కొంద‌రు అయినా న‌మ్మ‌కంతో అలాగే ఉంచారు, ఇంకొంద‌రు బాగా చ‌దువుకున్న వారు కూడా టిక్ టాక్ లు చేయ‌డంతో ఇది నిజం అని న‌మ్ముతున్నా‌రు… ద‌య‌చేసి ఇలాంటివి మాత్రం చేయకండి అంటున్నారు మేధావి వ‌ర్గం.