కరోనా లేదని ఇంటికి వెళుతున్నాడు ఈలోపు అనుకోని ఘటన

కరోనా లేదని ఇంటికి వెళుతున్నాడు ఈలోపు అనుకోని ఘటన

0
70
Corona

ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు ఇలా మనల్ని బలితీసుకుంటాయి… అప్పటి వరకూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు, ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. జమ్మూ కశ్మీర్లోని కఠువా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. 47 ఏళ్ల ఓ వ్యక్తి సరిగ్గా క్వారంటైన్ నుంచి విడుదలయ్యే కొద్ది గంటల ముందు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు.

అతనికి వైరస్ టెస్టులో నెగిటీవ్ వచ్చింది, దీంతో ఆనందంతో ఇంటికి వెళదాం అని భావించాడు, కాని ఇంటికి వెళుతున్న సమయంలో అతనికి విధి ఇలా బలితీసుకుంది,ఈ నెల 15న అతడు ముంబై నుంచి తిరిగి రావడంతో అధికారులు చంగారన్ క్వారంటైన కేంద్రానికి తరలించారు.

ఆ మరుసటి రోజే అతడి నమూనాలను కరోనా పరీక్షలకు పంపారు. 20 వ తేదిన అతనికి నెగిటీవ్ అని వచ్చింది.ఆదివారం విడుదల కావాల్సి ఉండగానే కుమార్ మృతి చెందాడని.. గుండెపోటు సమస్య కారణంగానే అతడు మృతిచెందినట్టు తెలిపారు వైద్యులు.