కరోనా వస్తే రూ.50 వేలు క్యాష్ బ్యాక్ – షాపు యజమాని వింత ఆఫర్

కరోనా వస్తే రూ.50 వేలు క్యాష్ బ్యాక్ - షాపు యజమాని వింత ఆఫర్

0
89

వ్యాపారాలు చేసే వారు అనేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు, ఈ కరోనా సమయంలో వ్యాపారాలు లేవు ఈ సమయంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపులకి రప్పించుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి షాపులు, తాజాగా కేరళలో ఓ ఎలక్ట్రానిక్ షాపు ఇలాంటి ఆఫర్ ఇచ్చింది. కాని అనుకున్నది ఒకటి అయింది ఒకటి.

మా దగ్గర షాపింగుకొచ్చిన కస్టమర్లు 24 గంటల్లో కరోనా బారిన పడితే రూ.50 వేలు క్యాష్ బ్యాక్ ఇస్తామని ప్రకటించింది. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని ప్రకటనలు ఇచ్చింది.

ఇది చూసిన లాయర్ బిను పులిక్కక్కందం ఇది చట్ట వ్యతిరేకం, శిక్షార్హమని భావించాడు. అప్పటికే కరోనా సోకిన వ్యక్తి ఎవరైనా క్యాష్ బ్యాక్ కోసం ఆశపడి.. తన ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టి ఈ షోరూంకు వెళ్లే ప్రమాదం ఉందంటూ సీఎంకు పిటిషన్ అందజేశాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు, అంతే షాపు క్లోజ్ చేయించి నోటీసులు ఇచ్చారు, ఇక షాపు తీయడానికి లేదు, దీంతో ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తే చర్యలు తప్పవు అని తెలిపారు పోలీసులు అధికారులు.