క‌రోనా వేళ కొత్త ఎత్తుగ‌డ వేసిన పెళ్లి కొడుకు పోలీసులు సీరియ‌స్ వార్నింగ్

క‌రోనా వేళ కొత్త ఎత్తుగ‌డ వేసిన పెళ్లి కొడుకు పోలీసులు సీరియ‌స్ వార్నింగ్

0
96

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి …అస‌లు ముందు అబ్బా‌యి త‌ల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు.. కార‌ణం.. అమ్మాయిది బీద‌ కుటుంబం అని, క‌ట్నం ఇవ్వ‌లేరు అని, త‌గిన సంబంధం కాదు అని అబ్బాయి కుటుంబం గోల పెట్టింది.. కాని అబ్బాయి చ‌స్తాను అని చెప్ప‌డంతో ఒప్పుకున్నారు, అయితే చెప్పిన విధంగా పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేయాలి అని కండిష‌న్ పెట్టాడు.

అప్పు చేసి అయినా ఏసీ క‌ల్యాణ మండ‌పంలో పెళ్లి సెట్ చేయాలి అని చెప్పారు, అయితే అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్న స‌మ‌యంలో ఈ క‌రోనాతో పెళ్లి మండ‌పాలు బుక్ చేయ‌డానికి లేదు.. వంద‌ల మందిని పిల‌వ‌డానికి లేదు, దీంతో సింపుల్ గా వివాహం అనుకున్న స‌మ‌యానికి చేద్దాం అని అమ్మాయి తండ్రి కోరాడు.

అయితే డ‌బ్బు ఖ‌ర్చు కాకూడ‌దు అని ఇలా పెళ్లి సింపుల్ గా చేద్దాం అని భావి‌స్తున్నారా అంటూ అబ్బాయి తండ్రి వాగ్వాదానికి దిగాడు, దీంతో ఈ పెళ్లి జ‌ర‌గ‌దు అని మేము వైరస్ త‌గ్గిన త‌ర్వాత కూడా చేసుకోము అని చెప్పాడు, దీంతో వెంట‌నే వ‌ధువు తండ్రి క‌న్నీటితో ఇంటికి వ‌చ్చాడు, తండ్రి బాధ‌ప‌డ‌టం చూసి నేరుగా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి కేసు పెట్టింది వ‌ధువు, రెండు గంట‌ల్లో పెళ్లి కొడుకు కుటుంబం స్టేస‌న్ కు వ‌చ్చింది, చివ‌ర‌కు 20 మంది స‌మ‌క్షంలో స్టేష‌న్ ద‌గ్గ‌ర దేవాల‌యంలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట‌..