క‌రోనా విగ్ర‌హం పూజ‌లు ఇదేం వింత అంటున్న నెటిజ‌న్లు

క‌రోనా విగ్ర‌హం పూజ‌లు ఇదేం వింత అంటున్న నెటిజ‌న్లు

0
83

ఈ క‌రోనా పేరు చెబితేనే అంద‌రూ భ‌య‌ప‌డి వ‌ణికిపోతున్న ప‌రిస్దితి, అయితే ఈ వైర‌స్ తో పూర్తిగా లాక్ డౌన్ కూడా విధించారు, ఇక డిసెంబ‌ర్ నుంచి ఆరు నెల‌లుగా ఈ వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది, వ‌ర‌ల్డ్ వైడ్ గా దాదాపు 80 ల‌క్ష‌ల పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి.అదే సమయంలో మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటేసింది.

మ‌న భార‌త్ లో కూడా దాదాపు 3 ల‌క్ష‌ల 30 వేల కేసులు న‌మోదు అయ్యాయి..క‌రోనా వైరస్ ఇప్పుడు దేవతగా మారిపోయింది. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. కరోనా వైరస్‌ను దేవతగా కొలుస్తున్న కేరళలోని కడక్కల్‌కు చెందిన వ్యక్తి.. ఇది ఇప్పుడు పెను వైర‌ల్ గా మారింది.

ఈ వైర‌స్ సోకిన వారిని ర‌క్షించాలి అని ఆదేవ‌త‌కు పూజ‌లు చేస్తున్నాడు, వైర‌స్ ని క‌రోనా మాత‌గా పేరు పెట్టి పూజిస్తున్నాడు ఆ వ్యక్తి పేరు అనిలన్. ఇదంతా అత‌ని ప‌బ్లిసిటీ కోసం చేస్తున్నాడు అని సోష‌ల్ మీడియాలో అత‌నిపై కామెంట్లు పెడుతున్నారు నెటిజ‌న్లు.