కరోనా వైరస్ ను ఇలా కూడా వాడుకుంటారా… ప్రియుడితో కలిసి మహిళా కానిస్టేబుల్ క్వారంటైన్…

కరోనా వైరస్ ను ఇలా కూడా వాడుకుంటారా... ప్రియుడితో కలిసి మహిళా కానిస్టేబుల్ క్వారంటైన్...

0
87

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ తన దండయాత్రనుకొనసాగిస్తోంది… ఎంతోమంది ఈ మాయదారి మహమ్మారి బారీన పడి చికిత్సతీసుకుంటుంటే మరో వైపు అక్రమసంబంధానికి కరోనా వైరస్ ను వాడుకుంటున్నారు… తాజాగా ఇలాంటి సంఘటన మహారాష్ట్రలో జరిగింది…

నాగ్ పూర్ కుచెందిన ఒక పోలీస్ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో స్టేషన్ లో పోలీసులను అలాగే ప్రైమరి కాంటాక్ట్ ఉన్న వారిని క్వారంటైన్ కు తరలించారు.. అందులో ఒకమహిళా కానిస్టేబుల్ తన ప్రియుడిని స్టేషన్ లో భర్త అని పరిచయం చేసి అతనితో క్వారంటైన్ లో ఉంటుంది… భార్యభర్తలకు ఒకే గదిని కేటాయించారు… దీంతో వారి విచ్చలవిడితనానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది… ఈ క్రమంలో అతని భార్య తన భర్త మూడు రోజులుగా కనిపించకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది…

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా పోలీసులకు షాకింగ్ విషయాలు బయట పడ్డాయి… మహిళా కానిస్టేబుల్ కు వివాహం కాలేదని తన ప్రియుడిని భర్తగా పరిచయం చేసి క్వారంటైన్ కు తీసుకువచ్చిందని తేలింది…. కాగా గతంలో మహిళా కానిస్టేబుల్ కు ప్రియుడు ప్రభుత్వ ప్రాజెక్ట్ పనిలో భాగంగా పరియం ఏర్పడింది… ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది…