కొందరు తమ నడివయసులో యవ్వన వయసులో బాగా నగదు సంపాదిస్తారు ..కొడుకులు మనవాళ్లు అవుతారు, కాని వచ్చే కోడళ్లు మనతో కలవాలి అని లేదు కదా, వివాహం అయ్యాక కొందరు కొడుకులు వెంటనే పెళ్లాల మాట విని అప్పటి వరకూ చూసిన అమ్మనాన్నని పట్టించుకోరు ఇదే జరిగింది.
ఏకంగా మంచి సంపాదన సంపాదించిన ఆ తండ్రి చివరకు మరణించాడు, తల్లి మాత్రమే ఉంది, ఆమె పేరు మీద నాలుగు ఫ్లాట్లు కొన్నాడు తండ్రి, కాని ఇప్పుడు ఏకంగా బిచ్చమెత్తుకునే స్దితికి తీసుకువచ్చింది కోడలు.
ఆమెని కోడలు కొడుకు చూసేవారు కాదు… అయితే మూడిటిని అద్దెకు ఇచ్చి ఒక ప్లాట్ లో ఆమె కుమారుడు కోడలు ఉంటున్నారు, ఆమె బంగారు నగలు కోడలు తీసుకుంది, ఇక అక్కడ ఉన్న గుడిలో బిచ్చం ఎత్తుకునేది అత్తగారు, అయితే నాలుగు ఇళ్లు తనపేరుమీద రాయాలి అని కోడలు కొడుకు అనడం ఆమె చేయను అని చెప్పడంతో, కోడలు క్రికెట్ బ్యాట్ తో కొట్టింది.. చివరకు గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తీసుకువెళ్లారు… ఆమె చికిత్స తీసుకుంటూ చనిపోయింది, వెంటనే పోలీసులకు అనుమానంతో ఫిర్యాదు చేశారు డాక్టర్లు, చివరకు మనవరాలు చెప్పిన క్లూ తో కోడలు చేసిన పని తెలిసింది. చివరకు కోడుకిని కోడలిని అరెస్ట్ చేశారు పోలీసులు.