డేంజ‌ర్ – ఆ గ్రామ‌స్తుల‌ని టార్గెట్ చేసిన పాము ఏం చేస్తోందంటే

డేంజ‌ర్ - ఆ గ్రామ‌స్తుల‌ని టార్గెట్ చేసిన పాము ఏం చేస్తోందంటే

0
154

వర్షాకాలం వ‌చ్చింది అంటే చాలు పాములు తెగ సంచ‌రిస్తాయి.. అయితే ఈ స‌మ‌యంలో ముఖ్యంగా ప్రత్యేకమైన ఆడపాములు సంచరిస్తూ గ్రామస్తులను కాటు వేస్తున్నాయని ఉత్తర్‌ప్రదేశ్ బహ్రయిచ్‌ జిల్లాలోని చిల్బిలా గ్రామానికి చెందిన ప్రజలు అంటున్నారు.

దాదాపు ఇక్క‌డ 26 మందిని పాము కాటు వేసింది, ఇక్క‌డ ఓ వ్యక్తి ఇటీవ‌ల పాముకాటుతో మ‌ర‌ణించాడు కూడా, దీంతో వీరు అంద‌రూ ఎప్పుడు పాము కాటు వార్త వినాల్సి వ‌స్తుందా అని భ‌య‌ప‌డిపోతున్నారు.. ఒకే రకమైన పాము అందరినీ కాటు వేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తోందని పలువురు అంటుండగా..ఇలా పామును పట్టుకోవటానికి స్థానికులు మంత్రగాళ్లను కూడా పిలుస్తున్నారు.

కట్ల, నాగుపాము వంటి పలు రకాల విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చి కాటు వేస్తున్నాయి. ముఖ్యంగా ఆడ‌పాము ఇలా ఎక్కువ మందిని కాటు వేసింది అంటున్నారు గ్రామ‌స్తులు, దీనికి కార‌ణాలు ఏమీ కావు అని ఎక్కువ‌గా ఆ పాములు ఉండి ఉంటాయి అంటున్నారు వైద్యులు.