దారుణం బతికుండగానే 25 వేల మందికి అంత్యక్రియలు

దారుణం బతికుండగానే 25 వేల మందికి అంత్యక్రియలు

0
97

కొన్ని సంఘటనలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, మనం నవీన నాగరికతలో ఉన్నామా? ఇంకా రాతి యుగంలో ఉన్నామా అనే అనుమానం కలిగిస్తాయి..అంతే కాదు ఈ మనిషి ఈ దేహన్ని వదిలి వెళితే తర్వాత ఏం జరుగుతుంది. ఇది చాలా మందికి వచ్చే అనుమానంగా ఉంది, అయితే మరణం రుచి చూడాలి అని అనుకుంటున్నారా యూరేపియన్ కంట్రీస్ లో మిమ్మల్ని మరణం అంచుల వరకూ తీసుకువెళతాం అని చాలా సంస్దలు టేస్ట్ చూపిస్తాయి,కాని ఇప్పుడు దానిని మించి కొత్త ఆలోచన ట్రెండ్ అవుతోంది.

దక్షిణ కొరియాకు చెందిన హోయోవాన్ హీలింగ్ సెంటర్ ఓ కత్తి లాంటి ఐడియాతో ముందుకు వచ్చింది. లీవింగ్ ఫ్యూనరల్ పేరుతో బతికుండగానే మనుషులకు అంత్యక్రియలు చేసేస్తోంది. ఇదేదో వింత అనుకోకండి వీరి ఐడియా ఇక్కడ జనాలకు పిచ్చకింద నచ్చేసింది.
ఓ శవపేటిక ఏర్పాటు చేసి ఆందులో కాసేపు టైం స్పెండ్ చేసేందుకు ప్రజలకు అవకాశం కల్పిస్తోంది. అసలు మనకు చివరి రోజు ఎలాంటి కార్యక్రమం చేస్తారు అనేది మనం బతికి ఉండగానే తెలుసుకోవచ్చు, ఇది సరికొత్త ప్రయోగంగా చెబుతోంది సంస్ధ.

ఇలా సుమారు 2012 నుంచి ఈ కార్యక్రమాలు చేస్తోంది సదరు సంస్ధ. ఇప్పటి వరకూ దాదాపు 25 వేల మంది బతికుండగానే ఇలా అంత్యక్రియలు చేయించుకున్నారు. శవపేటికలో పడుకుని దాని తలుపు మూసేస్తేజీవిత పరమార్ధం స్పష్టం మవుతోందని అనేక మంది సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే దాదాపు 13 దేశాల నుంచి ప్రజలు వచ్చి ఈ తతంగంలో పార్టిస్టిపేట్ చేస్తున్నారట, సో సిల్లి కదా.