ఆ జవాను శత్రువులతో యుద్దం చేసి మన దేశం కోసం ఎంతో కష్టపడుతున్నాడు, అయితే తన సొంత ఇంటికి ఫ్రిబ్రవరిలో వచ్చాడు.. మంచి సంబంధం కూతురికి కుదరడంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు, ఈ లోపు తను ఉద్యోగం నుంచి 5 లక్షల రూపాయలు లోన్ కూడా తీసుకున్నాడు, ఆ నగదుతో కూతురు పెళ్లి చేయాలి అని భావించాడు.
కాని ఒక్కసారిగా ఈ కరోనా ఆపద రావడంతో, తన కూతురి పెళ్లి కోసం తెచ్చిన ఐదు లక్షల నగదు పేదలకు నిత్యవసర సరుకులు కూరగాయలు పళ్లు కొని ఇచ్చాడు, అంతేకాదు రెండు లక్షల రూపాయలు పేదలకు సాయం అందించాడు.. కుటుంబానికి 5 వేల చొప్పున అందించాడు.
అయితే ఆ జవాను తన కూతురికి పేదల ఆశీస్సులు ఉంటాయని మళ్లీ అప్పు చేసి తన కూతురుపెళ్లి చేస్తాను అని చెప్పాడు, ఈ కరోనా సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదు అని వారు పస్తులు ఉండకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు.