ప్రస్తుతం బిగ్ బాస్ 2 హౌజ్‌లో ఉన్న ఐదుగురు సభ్యుల్లో ఒకరు సడన్ గా ఎలిమినేట్ అవుతున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ షో నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. కానీ ఇప్పుడు వారం మధ్యలో ఎలిమినేషన్ నిర్వహించాలని బిగ్ బాస్ టీం భావిస్తున్నట్లు సమాచారం.
ఇంతకీ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారా? దీప్తి నల్లమోతు. ఆమెను హౌజ్ నుంచి బయటకు పంపించేందుకు ప్లాన్ చేశారట బిగ్ బాస్ టీం. దీంతో గ్రాండ్ ఫినాలేలో నలుగురు మత్రమే పోటీ పడనున్నారు. ఓటింగ్ ప్రక్రియ ఆధారంగానే దీప్తిని బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు పంపించేస్తున్నారట. ఆమె బయటి నుంచి తన అభిమానుల ద్వారా ఫేక్ ఓటింగ్ చేపడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీప్తిని వారం మధ్యలోనే ఎలిమినేట్ అయితే.. హౌజ్‌లో గీతా మాధురి, సామ్రాట్, కౌశల్, తనీష్ మిగలనున్నారు. ఇందులో గ్రాండ్ ఫినాలేలో ఇద్దరు ఎలిమినేట్ అయితే మరో ఇద్దరు ఫైనల్‌కు వెళ్తారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలుస్తారు.