దేశంలో అబార్షన్ చేయించుకున్నవారు ఎంతమందంటే?

దేశంలో అబార్షన్ చేయించుకున్నవారు ఎంతమందంటే?

0
91

ఈ వైరస్ కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించింది కేంద్రం, ఈ సమయంలో పూర్తిగా దేశ వ్యాప్తంగా అన్నీ రంగాలు మూత పడ్డాయి, ఎవరూ బయటకు రాలేదు అందరూ ఇంటి పట్టున ఉన్నారు, అయితే పేషెంట్లు ఆస్పత్రికి వచ్చినా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అసలు ట్రీట్మెంట్ కూడా చేయలేదు.

ఈ క్రమంలోనే గైనకాలజిస్ట్ సలహా లేకుండానే దేశవ్యాప్తంగా 18.5 లక్షల అబార్షన్లు జరిగాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేయడంతో కూడా సురక్షితమైన గర్భస్రావం పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి అని తెలిపారు.

చాలా మంది లాక్ డౌన్ వేళ గర్భవతులు అయ్యారు, ఇందులో 30 శాతం మంది తమకు ఇప్పుడు గర్భం వద్దని నిర్ణయం తీసుకుని అబార్షన్ పిల్స్ సాధనాలు వాడినట్లు తెలుస్తోంది.