మళ్లీ వివాహం చేసుకుంటా – బిగ్ బాస్ కంటెస్టెంట్ దేవీ నాగవల్లి

మళ్లీ వివాహం చేసుకుంటా - బిగ్ బాస్ కంటెస్టెంట్ దేవీ నాగవల్లి

0
118

న్యూస్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో టీవీ9 దేవీ నాగవల్లి ఒకరు, ఆమె రిపోర్టింగ్ యాంకరింగ్ ఎంతో డేరింగ్ గా చేస్తుంది, పలు క్లిష్టతరమైన రిపోర్టింగ్ కూడా ఆమె చేసింది, డేరింగ్ ఉమెన్ గా ఆమెని రెండు తెలుగు రాష్ట్రాల్లో పిలుస్తారు, ఇక జర్నలిస్టుగా ఆమె అద్బుతమైన కెరియర్ తో ముందుకు సాగుతున్న వేళ.

ఆమెకి బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ఆహ్వానం వచ్చింది, ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు.. అంతేకాదు మూడో వారంలో ఆమె హౌస్ నుంచి బయటకు ఎలిమినేట్ అయి వచ్చేశారు, ఈ సమయంలో పలు ఇంటర్వ్యూలలో ఆమె పాల్గొంటున్నారు.

సీజన్ 4లో స్ట్రాంగ్ కంటేస్ట్ గా పేరు తెచ్చుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల తొందరగానే బయటకు వచ్చేసింది దేవి నాగవల్లి. ఇక ఆమె ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో కూడా అనేక కామెంట్లు వచ్చాయి.తనకు ఎక్కువగా ఓట్లు వచ్చినా కావాలనే బయటకు పంపించారని దేవి ఆరోపిస్తుంది.

ఇంటిలోని సభ్యులు కొందరు అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకున్నారని, అది కూడా వారు సేవ్ కావడం కోసమే అని అన్నారు. ఈ సమయంలో మరో కీలక కామెంట్ చేశారు ఆమె… తన మాజీ భర్త అమెరికాలో ఉన్నారు, మేము ఒకరికి ఒకరు మాట్లాడుకుని విడిపోయాం, ఆయన బాగా సెటిల్ అయ్యారు, అక్కడ వేరే వివాహం చేసుకున్నారు అని ఆమె చెప్పారు, అంతేకాదు తనకు కూడా వివాహం చేసుకోవాలి అని ఉంది

తనను, తన ఆరేళ్ళ కొడుకు కార్తికేయను అంగీకరించి పెళ్లి చేసుకుంటాను అంటే నేను సిద్ధం అని దేవి చెప్పింది. అయితే ఈ విషయంలో తన కొడుకు ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేది మాత్రం తెలియదు అన్నారుఆమె…. నిజమే హౌస్ లో పులిహార కలిపే వారిని ఉంచి మంచిగా గేమ్ ఆడేస్ట్రాంగ్ కంటెస్టెంట్లని బయటకు పంపడం ఏమిటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.