దెయ్యం వ్యాయామం చివరకు పోలీసులు ఏం తేల్చారంటే

దెయ్యం వ్యాయామం చివరకు పోలీసులు ఏం తేల్చారంటే

0
90

కొందరు ఏదైనా సోషల్ మీడియాలో కనిపించింది అంటే వెంటనే నమ్మేస్తారు.. ఇక అది ఇది అనేమీ ఉండదు, ప్రతీది నమ్మేస్తారు షేర్లు కామెంట్లు తెగ వైరల్ చేస్తారు, ఇప్పుడు అలాంటిదే యూపీలో జరిగింది. దెయ్యం ఓపెన్ జిమ్లో వ్యాయామం చేస్తోందంటూ వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది. ఎవరూ లేకుండానే యంత్రం దానికదే కదులుతుండటంతో దెయ్యమే కసరత్తు చేస్తోందని ప్రచారం చేశారు.

ఇక అసలు ఇందులో నిజం ఎంత అని తెలుసుకోవాలి అని పోలీసులు రెడీ అయ్యారు… చూస్తే ఝాన్సీ ప్రాంతంలోని కాశీరామ్ పార్కులో ఇటీవల ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు.. ఓ రోజు ఉన్నట్టు ఉండి రాత్రి సమయంలో జిమ్ యంత్రం దానికదే కదిలింది. ఈ విచిత్రాన్ని చూసి దెయ్యం కసరత్తు చేస్తోందని ప్రచారం చేశారు.

కాని అసలు విషయం ఆ జిమ్ యంత్రానికి ఎవరో గ్రీజ్ రాసారు, దీంతో ఇది కదులుతోంది, అని తేలింది, అందుకే అటూ ఇటూ కదలడం చూసి షాక్ అయి దీనిని సోషల్ మీడియాలో పెట్టారు ఇందులో వాస్తవం లేదు అని పోలీసులు స్ధానికులకి చెప్పారు.