దీపావళి మన దేశంలో ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, మరీ ముఖ్యంగా దీపావళి పండుగ నాడు పిల్లల చేత దివిటీలు కొట్టిస్తారు, ఇది ఏనాటి నుంచో వస్తున్న ఆచారం సిటీలు పల్లెల్లు గ్రామాలు పట్టణాలు ఇలా అన్నీచోట్ల దివిటీలు కొట్టిస్తారు..
సాయంత్రం ప్రదోష కాలంలో పిల్లలు దివిటీలు కొట్టే ఆచారం ఉంది. ఈ ఆచారం పితృదేవతలకు వెలుగుచూపించే నిమిత్తం వేసే
చర్య.
కొంత మంది ఆనవాయితీ ఉంటేనే కొట్టించాలి అంటారు.. దీనికి ఆనవాయితీ ఏమీ ఉండదు, ఎవరు అయినా పిల్లల చేత చేయించవచ్చు, ఈ దివిటీలు కొట్టే సమయంలో పిల్లలు చాలా ఆనందంలో ఉంటారు.. ఆకుకూరల కాడలు చెరకకు కాడలు చాలా మంది వాడుతారు, దివిటీల కోసం గోగుకర్రలు కూడా వాడతారు.
నూనెలో వత్తు వత్తి దానిని కర్రపై పెట్టి వెలిగించి ఈ దివిటీలు కొడతారు, పెళ్లికాని ఆడపిల్లలు, వడుగు కాని మగపిల్లలు చిన్నవాళ్లు మాత్రమే ఈ ప్రక్రియ జరుపుతారు. ఆ దివిటీలు కొట్టేటప్పడు చాలా జాగ్రత్తగా పిల్లలపై నూనె పడకుండా జాగ్రత్త తీసుకోండి.. కాటన్ వస్త్రాలు ధరించండి. ఇక ఇలా దివిటి కొట్టిన తర్వాత కాళ్లు చేతులు కడిగి ఆ తర్వాత తీపి పదార్ధం తినాల్సి ఉంటుంది.