పవన్ కల్యాణ్ హరీశ్ శంకర్ సినిమాపై – టాలీవుడ్ లో మూడు వార్తలు ?

Director Harish Shanker New Film With Pawan Kalyan

0
84

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో సినిమా అని ప్రకటన రాగానే ,అభిమానులు చాలా ఆనందించారు. వీరి కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కి మంచి పేరు తెచ్చింది. కెరియర్లో సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత వీరి కాంబోలో సినిమా రాలేదు. అయితే ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తోంది.

అయితే ప్రస్తుతం పవన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సెట్స్ పై ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం, హరీశ్ సినిమాని కూడా పవన్ ఆగస్ట్ నుంచి పట్టాలెక్కించాలని భావిస్తున్నారట.ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా పవన్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. తండ్రి పాత్రలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా రోల్ చేయనున్నారట.

అయితే ప్రస్తుతం ఉన్న రెండు సినిమాలతో పాటు ఈ సినిమాకి కూడా డేట్స్ ఇస్తున్నారని, నెలకి పది రోజులు సినిమాకి డేట్స్ ఇస్తున్నారని టాలీవుడ్ టాక్ . క్రిష్ తో హరిహర వీరమల్లు, మరో వైపున అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో చేస్తూనే, హరీశ్ సినిమా కూడా చేయనున్నారట.