డాక్టర్ సుధాకర్ లాగే తనను కూడా వేధిస్తున్నారు… మహిళా డాక్టర్…

డాక్టర్ సుధాకర్ లాగే తనను కూడా వేధిస్తున్నారు... మహిళా డాక్టర్...

0
84

వైసీపీ నేతలు డాక్టర్ సుధాకర్ లాగానే తనను నిర్భందించి వేధించారని చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ అనితారాణి అరోపించారు… గతంలో తనకు అమెరికాలో ఉద్యోగం వచ్చినా కూడా దాన్ని వదులుకుని ప్రజాసేవ చేసేందుకు వచ్చానని అన్నారు…

కొద్దికాలంగా తీవ్రమైన పదజాలంతో దూషిస్తున్నారని ఆమె ఆరోపించారు… ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకున్నారని ఆమె వాపోయింది… కింద స్ధాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతుంటే దాన్ని ప్రశ్నించడమే తప్ప అయిపోయిందని అన్నారు…

తనపై స్ధానిక అధికారి పార్టీనేతలు జనతా కర్ఫ్యూ రోజున తనను ఓ గదిలో బంధించి రకరకాలు వేధించారని తెలిపింది… అంతేకాదు వాష్ రూమ్ లో తన ఫోటోలు వీడియోలు తీసి మానసికంగా వేధింపులకు గురి చేశారని తెలిపింది…