బ్రేకింగ్ – రక్తదానం చేసిన కుక్క ? ఎవరికి చేసిందో తెలుసా

బ్రేకింగ్ - రక్తదానం చేసిన కుక్క ? ఎవరికి చేసిందో తెలుసా

0
90

ఎవరైనా ప్రాణాపాయ స్ధితిలో ఉన్నా వారికి ఆపరేషన్ అవసం అయినా, ఆ సమయంలో వారి ప్రాణాలు కాపాడాలి అంటే వారికి రక్తదానం చేస్తారు, ఇలా కొన్ని కోట్ల మంది రక్తదానం చేసి చాలా మందిని కాపాడారు,. రక్తదానం చేసి మనిషికి పునర్జన్మ ప్రసాదించడం చాలా మంచి పని.

అయితే ఇలా రక్తం ఇచ్చినవారి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఒక మనిషి ఇంకొక మనిషికి రక్తదానం చేయడం చాలా మంది చూసే ఉంటారు. కానీ ఒక శునకం ఇంకో శునకం కోసం రక్తదానం చేయడం ఎక్కడైనా విన్నారా..

ఎస్ తాజాగా ఇదే జరిగింది.. చెన్నైకి చెందిన డానీ అనే 13 ఏళ్ల శునకం కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. దీంతో యజమాని కోల్కతాకు తీసుకెళ్లి డానీకి వైద్యం ఇప్పించాడు. డానీకి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు. కుక్కులకి రక్తం దొరకడం చాలా కష్టంగా మారింది… ఈ సమయంలో అనింద్య చటర్జీ.. తన పెంపుడు శునకం సియా రక్తదానం చేస్తుందని తెలిపాడు. ఇలా సియా నుంచి 15 నిమిషాల పాటు రక్తాన్ని సేకరించి డానీకి ఎక్కించారు వైద్యులు. ఇక డానీ ప్రాణాలతో బయటపడింది, దాని యజమాని చాలా ఆనందంలో ఉన్నారు.