ధూమపానం అల‌వాటు మానేసి ఇళ్లు క‌ట్టాడు ఇత‌ని రియ‌ల్ స్టోరీ

ధూమపానం అల‌వాటు మానేసి ఇళ్లు క‌ట్టాడు ఇత‌ని రియ‌ల్ స్టోరీ

0
139

మ‌న చెడ్డ అల‌వాట్లే మ‌న‌ల్ని పాడుచేస్తాయి, మ‌న మంచి అల‌వాట్లే మ‌న‌ల్ని ఉన్న‌తికి తీసుకువెళ‌‌తాయి, అయితే సిగ‌రెట్లు కాల్చేవారు చాలా మంది ఉంటారు, వద్దు అని చెప్పినా వినిపించుకోరు ఇంటిళ్ల పాది ఆ పొగ తాగ‌డం మానెయ్ అని చెప్పినా వీరు మాత్రం వినిపించ‌కోరు.

కేరళకు చెందిన ఓ పెద్దాయన సిగ‌రెట్లు కాల్చ‌డం మానేశాడు, దీని వ‌ల్ల అత‌నికి ఎంతో ప్ల‌స్ అయింది, ఆరోగ్యం బాగుప‌డింది, చుట్ట తాగడం అలవాటున్న ఆయన కొన్నేళ్లుగా సిగరెట్లు మానేసి.. ఆ డబ్బును జమచేశారు. అలా జమచేసిన డబ్బుతో ఏకంగా ఇళ్లు కట్టాడు..ఈయన పేరు వేణుగోపాలన్ నాయర్.

ఇక ఆయ‌న వ‌య‌సు 75 సంవ‌త్స‌రాలు, ఆయ‌న చేసిన ప‌నికి అంద‌రూ షాక్ అయ్యారు. ఆయ‌న సిమెంట్ తాపీ ప‌నికి వెళ్లేవాడు, ఇలా సుమారు చాలా డ‌బ్బు సిగ‌రెట్ల‌కు ఖ‌ర్చు చేశాడు..2012లో ఓసారి ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది. చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లారు.. చివ‌ర‌కు సిగ‌రెట్లు మానెయ్యాలి అని చెప్పారు ఆ రోజు నుంచి సిగ‌రెట్ కాల్చ‌లేదు, అలా దాచిన డ‌బ్బు 5 ల‌క్ష‌లు అయింది.. దానితో త‌న‌కు స‌రిపోయేలా ఓ ఇళ్లు క‌ట్టుకున్నాడు, రోజుకి 150 రూపాయల సిగ‌రెట్లు కాల్చేవాడు, ఇక ఆరోగ్యం బాగుంది ఆర్ధికంగా బాగుంది.