రోడ్డుమీద దొరికిన బంగారపు రాయి అమ్మాడు అతనికి ఎంత డబ్బు వచ్చిందంటే

రోడ్డుమీద దొరికిన బంగారపు రాయి అమ్మాడు అతనికి ఎంత డబ్బు వచ్చిందంటే

0
95

మనకి అద్రుష్టం ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పలేము… ఆస్ట్రేలియా కు చెందిన డేవిడ్ హోల్ అనే వ్యక్తి రోడ్డు పై వెలుతూ కనిపించిన ఒక రాయిని 5 సంవత్సరాల క్రితం ఇంటికి తెచ్చాడు. అది బంగారు రాయి అనుకున్నాడు కాని దాని గురించి తెలిసి ఆశ్చర్యపోయాడు. అవును అతని స్టోరీ తెలిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.

డేవిడ్ హోల్ ఓరోజు ఎర్రగా, అక్కడక్కడ పసుపు రంగు మచ్చలతో ఉన్న రాయిని చూసాడు. అది బంగారు రాయి అయి ఉంటుంది అని ఇంటికి తీసుకొచ్చాడు. ఎంత ప్రయత్నించినా అది పగల్లేదు. బంగారం అయితే పగులుతుంది కదా అని పెద్ద పట్టించుకోకుండా ఇంటి కబోర్డుల్లో ఉంచేశాడు, దాని గురించి కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదు పిల్లలు ఆడుకుని అక్కడే పెట్టేవారు, కాని ఓరోజు బంగారం కంటే విలువైన వస్తువులు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి అనే విషయంపై ఓ పత్రికలో ఆర్టికల్ చదివాడు, వెంటనే గతంలో తనకు దొరికిన ఆ బంగారు రాయి గుర్తు వచ్చింది.. ఇది నిజంగా బంగారం కంటే విలువైనదా అని తెలుసుకోవాలి అని అనుకున్నాడు.

బంగారం షాపుకి వెళితే మోసపోతాను అని భయపడ్డాడు. దాన్ని తీసుకొని మెల్బోర్న్ మ్యూజియం కి వెళ్లాడు. దాని పై పరిశోధనలు చేసి అది మామూలు రాయి కాదని బంగారం కంటే విలువైన ఉల్క అని పరిశోధకులు గుర్తించారు. అది భూమి పై ఎప్పుడు ఎలా పడిందో శాస్త్ర వేత్తలు పరిశోధిస్తున్నారు. అయితే అది తీసుకున్న పురాతత్వ శాస్త్రవేత్తలు అతనికి 20 కోట్ల రూపాయలు ఇచ్చారు.దీంతో అతని ఆనందానికి అవదుల్లేకుండా పోయింది.