కొందరు తాము చేసిన పని ఎవరికీ తెలియకుండా ఉండాలి అని అతి తెలివి ప్రదర్శిస్తారు, అయితే ఇలాంటి వారిపై అనుమానం వస్తే వెంటనే పోలీసులు వీరి బండారం బయటపెడతారు, తాజాగా అలాంటిదే జరిగింది…ఒక మహిళను అతి కిరాతకంగా చంపేశారు ముగ్గురు దుర్మార్గులు. ఆమె శవాన్నీ కారులో తీసుకువెళుతున్నారు చివరకు ఏమైందంటే.
పరగణ జిల్లాలోని బసంతి హైవేపై రాత్రి ముగ్గురు వ్యక్తులు ఒక పెద్ద కూరగాయల బస్తాని పసుపు రంగు టాక్సీ లో తీసుకువెళుతున్నారు, ఈ సమయంలో రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అనుమానంతో చేస్ చేశారు, లోపల ఏముందో చూస్తే కూరగాయల బస్తా అన్నారు, లోపల పోలీసులు చెక్ చేశారు.
కాని అందులో ఓ మహిళ శవం ఉంది, దీంతో వారిని విచారిస్తే ..ఆ మహిళను చంపింది తామేనని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక ఆ ముగ్గురు కూడా ఆ మహిళ బంధువులే..కుటుంబ కలహాల తోనే ఆమెని భర్త చంపేశాడు, ఇక ఆమె భర్త కూరగాయల వ్యాపారి … తెలివిగా రోజూ తన దుకాణానికి కూరగాయలను తీసుకెళ్లడానికి పురమాయించే ట్యాక్సి మాట్లాడి అందులో శవం తరలించారు…ఎటువంటి అనుమానాలను రాకుండా మృతదేహాన్ని కూరగాయల బస్తాలో కుక్కి డిక్కీలో ఎక్కించారు. చివరకు ఈ విషయం డ్రైవర్ కు తెలియదు, అయితే వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.