దుర్యోధనుడు ఎవరు ? అతని పుట్టుక గురించి మీకు తెలుసా

దుర్యోధనుడు ఎవరు ? అతని పుట్టుక గురించి మీకు తెలుసా

0
80

భారతంలో దుర్యోధనుడి పాత్ర ఎంతో గొప్పది, గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు దుర్యోధనుడు . గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి, ధర్మరాజుని ప్రసవించిన విషయం వింటుంది
ఇలా 12 నెలల తన గర్భాన్ని ఆత్రుతతో తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవిస్తుంది.

ఈ విషయం తెలుసుకున్న వ్యాస మహర్షి…. హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరుస్తాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరువాత నూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్తాడు.

ఆ తర్వాత వ్యాసుడు చెప్పినట్లే జరుగుతుంది, పెద్ద పిండం నుంచి దుర్యోధనుడు జన్మించాడు. తరువాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక, దుస్సల జన్మించారు. వీరందరూ కౌరవులు అయ్యారు.