ఈ బట్టలు వేసుకుంటే కరోనా వైరస్ రాదట, చనిపోతుందట కంపెనీ ప్రకటన

ఈ బట్టలు వేసుకుంటే కరోనా వైరస్ రాదట, చనిపోతుందట కంపెనీ ప్రకటన

0
85

ఈ వైరస్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు, అయితే మాస్క్ లు ధరిస్తున్నారు, ఇటు వైద్యులు అయితే పీపీఈ కిట్లు ధరిస్తున్నారు.కానీ ఓ బట్టల కంపెనీ మాత్రం యాంటీ వైరస్ బట్టలను మార్కెట్ లోకి తెచ్చేసింది. ఈ బట్టలు ధరిస్తే కరోనాలాంటి మహమ్మారి వైరస్ లు కూడా ఏమీ చేయలేంటున్నారు.

ఈ సమయంలో ఇలాంటి బట్టలకు డిమాండ్ ఉంటుంది అని ఈ కంపెనీ కూడా డిఫరెంట్ గా ఆలోచన చేసింది, ఇలా
వైరస్ క్రిములు ఈ బట్టల మీద పడితే కేవలం 30 నిమిషాల్లోనే చనిపోతాయట. 30 నిమిషాల్లోనే ఆ వైరస్ ను ఈ బట్టలు చంపేస్తాయట.

ముంబైకి చెందిన డోనియర్ ఇండస్ట్రీస్ ఈ బట్టలను తీసుకువచ్చింది. స్విట్జర్లాండ్కు చెందిన హీక్యూతో కలిసి డోనియర్ ఇండస్ట్రీస్ యాంటీ వైరస్ దుస్తులను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నియో టెక్ బ్రాండ్ కింద ఈ దుస్తులను తయారు చేస్తున్నారు.
ఇక సాధారణ దుస్తుల కంటే ధర ఇది 20 శాతం ఎక్కువ ఉంటాయి అని కంపెనీ చెప్పింది.హీక్యూ వైరోబ్లాక్ ఎన్పీజే 03 సాంకేతికత ద్వారా ఇవి తయారయ్యాయట.