ఈ దొంగ చేసిన పని ఎవరూ చేసి ఉండరు? ఏం చేశాడంటే

ఈ దొంగ చేసిన పని ఎవరూ చేసి ఉండరు? ఏం చేశాడంటే

0
132

చాలా మంది తప్పు చేసినా దానిని ఒప్పుకోరు, మరికొంత మంది దానిని ఒప్పుకుని క్షమాపణ అడుగుతారు, ఈ లాక్ డౌన్ వేళ చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు, ఈ సమయంలో వలస కూలీలు కాలినడకన సొంత గ్రామాలకు ప్రయాణం అయ్యారు, అయితే ఓ వ్యక్తి తనకు వేరే దిక్కులేక ఇంటి ఎదురు వ్యక్తి బైక్ దొంగతనం చేశాడు, చివరకు ఏమైందంటే.

తమిళనాడులోని ఓ వ్యక్తి బైక్ దొంగతనానికి గురి అయింది, అయితే ఆ బైక్ పోయింది అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, సీసీటీవీ పుటేజీ ఆధారంగా దగ్గర్లోని టీషాపులో పనిచేసే వ్యక్తే దాన్ని దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సదరు వ్యక్తి లాక్డౌన్లో ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో కుటుంబాన్ని సొంతూరు చేర్చడానికి బండిని దొంగతనం చేసినట్లు తెలిసింది.

చివరకు బైక్ రాదు అనుకున్నాడు, కాని నిన్న ఆ వ్యక్తి ఈ బైక్ ని నేరుగా ఇతని ఇంటికి పార్శిల్ పంపాడు, పార్శిల్ కంపెనీ నుంచి సమాచారం వచ్చి అతను చూస్తే తన బైక్ తిరిగి వచ్చింది, అంతేకాదు ఓ లేఖ రాశాడు, తనకు ఏదారి లేక మీ బైక్ తీసుకువెళ్లాను మీ బైక్ మీకు
తిరిగి పంపిస్తున్నా అని చెప్పాడు, మొత్తానికి ఈ దొంగ చేసిన పనికి అందరూ ముందు తిట్టుకున్నా తర్వాత అతనిని మెచ్చుకున్నారు.