ఈ అమ్మాయి దొంగను ఎలా పట్టుకుందో చూడండి వైరల్ అవుతున్న వీడియో ఇదే

ఈ అమ్మాయి దొంగను ఎలా పట్టుకుందో చూడండి వైరల్ అవుతున్న వీడియో ఇదే

0
89

ఈ మధ్య దొంగతనాలు దారుణంగా పెరిగిపోయాయి, అయితే 15 ఏళ్ల యువతి సెల్ ఫోన్ దొంగిలించాలి అని భావించారు కొందరు దొంగలు… కాని వారిని నిలువరించింది ఆమె… ఇప్పుడు దేశంలో అందరూ ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు, మరి ఆ ఘటన ఏమిటో చూద్దాం.

పంజాబ్లోని జలంధర్కు చెందిన కుసుమ్ కుమారి ఆమె వయసు 15 ఏళ్లు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా దొంగలు అవినాష్ కుమార్ వినోద్ కుమార్ బైక్పై ఆమెను వెంబడించారు. చేతిలోని మొబైల్ ఫోన్ను లాక్కుని పారిపోయేందుకు యత్నించారు, వెంటనే ఆమె వారిని పట్టుకుంది వెనుక ఉన్న అవినాష్ ను గట్టిగా పట్టుకుంది, కత్తితో ఆమె చేతిపై దాడి చేశాడు.

అయినా ఆమె అతన్ని వదలలేదు, దీంతో వెంటనే స్ధానికులు వచ్చి అతన్ని పట్టుకున్నారు, ఇదంతా అక్కడ సీసీ టీవీకెమెరాల్లో రికార్డ్ అయింది, వెంటనే అతనిని పోలీసులకు అప్పగించారు, గాయాలపాలైన సాహస బాలికకు జోషి ఆస్పత్రి ఉచితంగా చికిత్స అందిస్తోంది..ఆమెని దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారు, నువ్వు సాహసబాలికవి అని అంటున్నారు.ఆమెకు రూ.51 వేల నజరానా ప్రకటించారు అధికారులు.

ఆ వీడియో చూడండి